Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Sunday, June 26, 2022

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా

 ‘దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా’ అంటాడు రాముడు.      ఏ దేశానికి వెళ్లినా కొత్త మిత్రులు, కొత్త బంధువులు దొరుకుతారేమో! కానీ, తోడబుట్టిన వాళ్లు మాత్రం దొరకరు.      అన్నదమ్ముల మధ్య సౌహార్దం, ఆనందం, సున్నితత్వం, సంతోషం ఎంత గొప్పగా ఉంటాయో రామ, భరత, లక్ష్మణ, శతృఘ్నుల ద్వారా తెలుస్తుంది.    వాలి,- సుగ్రీవుల మధ్య అనుబంధం కొరవడటంతో సుగ్రీవుడొక్కడే మిగిలాడు.      రావణ, విభీషణ, కుంభకర్ణుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో "విభీషణుడు," ఒక్కడే మిగిలాడు.     సోదరులతో కలిసి ఉన్న రాముడిని చూసి విభీషణుడు ‘నా వల్లే మా అన్న మరణించాడు. అన్నదమ్ములుగా కలిసి బతకలేకపోవడం కన్నా సిగ్గుచేటు లోకంలో మరొకటి లేదు’ అని విలపిస్తాడు. తోబుట్టువుతో కూడా కలిసి జీవించలేనివాడు లోకంలో ఇంకెవరితో కలిసి ఉండగలడు?

అరణ్యవాసానికి వెళ్లిన తొలినాళ్లలో ఒకరోజు రాముడు  - లక్ష్మణుడిని పిలిచి ‘భరతుడు మన తల్లులకు ఆపద తలపెడతాడేమో? నువ్వు ఇంటికి వెళ్లడం మంచిది’ అని చెప్తాడు.     అప్పుడు లక్ష్మణుడు ‘ఇదే మాట వదినకు చెప్పవేం అన్నయ్య! ఆమె నిన్ను వదిలి ఉండలేదు కాబట్టి చెప్పడం లేదు కదా! కానీ, నేను కూడా నిన్ను విడిచి ఉండలేను.     అది నా బలహీనత, బలం కూడా! చేప నీళ్లలో ఉన్నంత కాలమే బతికినట్టు, నువ్వు ఎంతకాలం నాకు కనబడతావో అంతవరకే నేను బతికి ఉంటాను’ అంటాడు "లక్ష్మణుడు.'


🙏 ఇక భరతుడి విషయానికి వస్తే, తన తల్లి కోరికలే రాముడి వనవాసానికి కారణమని తెలిసి కుంగిపోతాడు. అడవుల్లో ఉన్న రాముణ్ని వెతుక్కుంటూ వెళ్లి కలుస్తాడు.     అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు కావాల్సిందిగా కోరుతాడు.     కానీ, తండ్రికి ఇచ్చిన మాట తప్పలేనన్న రాముడు, భరతుడికి ధర్మబోధ చేస్తాడు.       అన్న మీద అభిమానంతో, గౌరవం తో పాదుకలను రాముడి పాదాలకు తొడిగించి, ‘నువ్వు అయోధ్యకు వచ్చేంతవరకు ఈ 'పాదుకలే," రాజ్యపాలన చేస్తాయ’ని చెప్పి వాటిని తనవెంట తీసుకెళ్తాడు భరతుడు.


🙏సుగ్రీవుడి మీదికి యుద్ధానికి వెళ్తున్న వాలికి తార అడ్డుపడుతుంది. ‘ఒకసారి నా మాట విను. ఒక్క తల్లికి పుట్టిన బిడ్డలు మీరు.     ఒకే చెట్టుకు కాసిన కాయల్లాంటి వారు. మనకున్న రెండు చేతులు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయా! పైగా ఒకదానికి నొప్పి కలిగితే, దాని పని కూడా రెండో చేయి చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు చేతులు ఒకే శరీర సంబంధం కలిగి ఉన్నాయి’ అని "అన్నదమ్ముల అనుబంధం ' గొప్పదనాన్ని వివరిస్తుంది తార.   . ఆమె మాటలు పెడచెవిన పెట్టి వాలి తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నాడు.



🙏బాల్యంలో అన్యోన్యంగా పెరిగిన అన్నదమ్ములు పెద్దయ్యాక లౌకిక వ్యవహారాల్లో పడి ఆప్యాయతలు దూరం చేసుకుంటుంటారు. ఆస్తిపాస్తుల ఉచ్చులోపడి అనురాగాలకు దూరమవుతుంటారు. ఏండ్లకేండ్లు ముఖాలు కూడా చూసుకోకుండా ఏదో సాధించామని భ్రమలో బతుకుతుంటారు.   ‌కానీ, ఏడాదికి ఒకసారైనా అన్నదమ్ములంతా కలిసి తల్లిదండ్రులకు "శ్రాద్ధ విధులు".   నిర్వర్తించాలి. శ్రాద్ధంలో తమ్ముల చేతుల్లోంచి అన్న చేతులమీదుగా జారిన తిలోదకాలతో "పితృదేవతలు "తమ దాహం తీర్చుకుంటారట. ఎక్కడివారు అక్కడే తద్దినాలు పెడితే, ఆ పిల్లలను చూసి ఇలాంటి నీచులను కన్నామని పితృదేవతలు చిన్నబుచ్చుకుంటారట. ఒక కడుపున పుట్టినప్పుడు ఒకటిగా ఉండటం సాధ్యం కాదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది.

అన్న ఎంత ధార్మికుడు, తమ్ముడు ఎంత మంచివాడు కానివ్వండి.. ఒకరింటికి ఒకరు వెళ్లకపోతే వాళ్ల గౌరవం చేజేతులా నాశనం చేసుకున్నట్టే.   ‌వ్యక్తిగతంగా ఇద్దరూ మంచివాళ్లే అయినా, వైరం ఇద్దరి కీర్తినీ మంటగలుపుతుంది.


🙏 చిన్నప్పుడు ప్రేమగా పెరిగి, వయసొచ్చాక మనస్పర్ధలు పెంచుకోవడం అర్థ రహితం.    పెద్దవాళ్లయ్యాక కూడా తోబుట్టువులు అందరితో కలిసి ఆప్యాయతలు పంచుకోవడం కన్నా అదృష్టం మరొకటి లేదు. రక్త సంబంధం గొప్పదనాన్ని గుర్తించి మన కుటుంబవ్యవస్థను కాపాడుకుందాం.   అన్నను గౌరవించడం, తమ్ముడిని ఆదరించడం, సోదరిని కనిపెట్టుకొని ఉండటం తోబుట్టువులు కనీస ధర్మంగా భావించాలి.

" హరిసర్వోత్తమ"

" వాయు జీవోత్తమ'

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

Thursday, April 14, 2022

నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమo

*ఒక స్వర్ణకారుడి మరణంతో, అతని కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. తినడానికి సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు. ఒకరోజు అతని భార్య తన కొడుక్కి నీలమణిహారాన్ని ఇచ్చి - "నాయనా, దీన్ని మీ మామయ్య దుకాణానికి తీసుకెళ్లు, ఈ హారాన్ని అమ్మి, మనకు కొంత డబ్బు ఇవ్వమని మీ మామయ్యకు చెప్పు", అని అంది.*
*కొడుకు ఆ హారాన్ని తీసుకుని మేనమామ దుకాణానికి చేరుకున్నాడు.*
*మేనమామ ఆ హారాన్ని క్షుణ్ణంగా చూసి - "నాయనా, ప్రస్తుతం మార్కెట్ బాగా మందంగా ఉందని అమ్మకు చెప్పు. కొంత కాలం తర్వాత అమ్మితే మంచి ధర వస్తుంది", అని కొంత డబ్బు ఇచ్చి, "రేపటి నుండి వచ్చి నాతో పాటు దుకాణంలో కూర్చో" అని చెప్పాడు.*
*మరుసటి రోజు నుండి, దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టాడు, అక్కడ వజ్రాలను, ఎలా పరీక్షించాలో నేర్చుకోవడం ప్రారంభించాడు.*
*త్వరలోనే, అతను వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో అనుభవశాలి అయ్యాడు.  
*ఒకరోజు మేనమామ, ‘‘అమ్మ హారాన్ని ఇప్పుడు తీసుకుని రా… ఇప్పుడు మార్కెట్ బాగుందని చెప్పు, నీకు మంచి ధర వస్తుంది’’, అన్నాడు.*
*తల్లి వద్ద నుండి హారాన్ని తీసుకుని ఆ యువకుడు స్వయంగా పరీక్షించగా అది నకిలీదని తేలింది. మేనమామ అంత గొప్ప అనుభవశాలి అయ్యి కూడా, వారికి ఈ విషయం ఎందుకు తెలియజేయలేదని ఆశ్చర్యపోయాడు.*
*వాడు హారాన్ని ఇంట్లోనే వదిలేసి  వచ్చాడు**
*మేనమామ, “హారం* *తీసుకురాలేదా?” అని* *అడిగాడు. **
*"మామయ్యా, ఈ హారం కృత్రిమమైనది, నిజమైనది కాదు .... మీరు ఈ విషయం నా నుండి ఎందుకు దాచారు?" అని అడిగాడు.*
*దానికి అతని మేనమామ, “నువ్వు నాకు హారం తెచ్చిన వెంటనే అది కృత్రిమమైనది అని చెబితే, నువ్వు కష్టాల్లో ఉన్నందువల్లనే నేను నిన్ను మోసం చేస్తున్నాను అని అనుకునేవాడివి".*
*”ఈ రోజు నీకు నీకుగా జ్ఞానం ఉంది గనుక, హారం నిజంగా నకిలీదని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఆ సమయంలో, నిజం మాట్లాడటం కంటే సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ముఖ్యమనిపించింది", అని చెప్పాడు.*
*నిజం ఏమిటంటే, జ్ఞానం లేనప్పుడు, మనం ఆలోచించేది , ఈ ప్రపంచంలో చూసేది, తెలుసుకున్న ప్రతిదీ తప్పే. దీని కారణంగా, మన సంబంధాలు అపార్థాలకు గురవుతాయి, అది విభేదాలకు దారి తీస్తుంది.
*మన సంబంధాలు ఒక అదృశ్య దారం ద్వారా ముడిపడి ఉన్నాయి. ప్రేమ, విశ్వాసం,నమ్మకం ద్వారా అది సంరక్షించబడుతుంది.*
*ఒక చిన్నపాటి ఒత్తిడి వల్ల అపార్థం చేసుకోకండి ...*
*వ్యక్తులను మీ స్వంతం చేసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది.చెడగొట్టుకోవడానికి ఎంతో సమయమక్కరలేదు

Monday, November 22, 2021

తెలిసి మసులుకో -- కలిసి జీవించు

                 విత్తనం తినాలని

                 చీమలు చూస్తాయ్..


                 మొలకలు తినాలని

                 పక్షులు చూస్తాయ్..

           

                 మొక్కని తినాలని

                పశువులు చూస్తాయ్


                 అన్ని తప్పించుకుని

             ఆ విత్తనం వృక్షమైనపుడు..


            చీమలు, పక్షులు, పశువులు..

         ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్....


            జీవితం కూడా అంతే TIME

          వచ్చే వరకు వేచివుండాల్సిందే

          దానికి కావాల్సింది ఓపిక మాత్రమే.....        


               లైఫ్ లో వదిలి వెళ్ళిన

           వాళ్ళ గురించి ఆలోచించకు..


              జీవితంలో ఉన్న వాళ్ళు

              శాశ్వతం అని భావించకు..


           ఎవరో వచ్చి నీ బాధను అర్థం

           చేసుకుంటారని ఊహించకు...


              నీకు నీవే ధైర్యం కావాలి.....

          నీకు నువ్వే తోడుగా నిలబడాలి...


                  లోకులు కాకులు,

                 మనిషిని చూడరు,

              మనస్సును చూడరు,

              వ్యక్తిత్వాన్ని చూడరు.


                     కనిపించింది,

            వినిపించింది నమ్మేస్తారు,

                 మాట అనేస్తారు,


                 ఒక్కోసారి మన కళ్ళే

              మనల్ని మోసం చేస్తాయి.


           మరొకసారి చెప్పుడు మాటలు

                        జీవితాలను

                  తలకిందులు చేస్తాయి


             అబద్దాలతో, మోసాలతో

                   కీర్తి, ప్రతిష్టలను

         ఎంత గొప్పగా నిర్మించుకొన్నా..

          అవి కుప్పకూలి పోవడానికి

               ఒక్క "నిజం"చాలు.

             అందుకే కష్టమైనా సరే

          నీతిగా బ్రతకడమే మనిషికి

                  ఉత్తమ మార్గం.

         

                ఒక చిన్న మొక్కనాటి

      ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని      

                   చూడకూడదు.


             ఎందుకంటే అది పెరగాలి

                మొక్క వృక్షం కావాలి

          పుష్పించాలి, పిందెలు రావాలి

         అవి కాయలై , పండితే తినగలం.


              అలాగే నేను ఇది కావాలి

              అనే కోరిక కూడా మొలకై

       వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి    

         మసలుకోండి సన్నిహితులారా🌹


               జీవితంలో కష్టము,

             కన్నీళ్ళు, సంతోషము,

        భాధ ఏవి శాశ్వతంగా ఉండవు,


     కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.

       ఆనందం, ఆవేదన కూడా అంతే.


              నవ్వులూ, కన్నీళ్ళూ

              కలగలసినదే జీవితం


             కష్టమూ శాశ్వతం కాదు,

       సంతోషమూ శాశ్వతమూ కాదు.


                    🌹🌹🌹🌹

    


                      ఓడిపోతే

            గెలవడం నేర్చుకోవాలి,


                     మోసపోతే

       జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి


                  చెడిపోతే ఎలా

           బాగుపడలో నేర్చుకోవాలి,


         గెలుపును ఎలా పట్టుకోవాలో

                తెలిసిన వాడికంటే

                   ఓటమిని ఎలా

          తట్టుకోవాలో తెలిసిన వారే

               గొప్ప వారు నేస్తమా !


              దెబ్బలు తిన్న రాయి

            విగ్రహంగా మారుతుంది


              కానీ దెబ్బలు కొట్టిన

             సుత్తి మాత్రం ఎప్పటికీ

          సుత్తిగానే మిగిలిపోతుంది....


          ఎదురు దెబ్బలు తిన్నవాడు,

         నొప్పి విలువ తెలిసిన వాడు

          మహనీయుడు అవుతాడు...


       ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు

    ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు...

    

         

  


                 డబ్బుతో ఏమైనా

           కొనగలమనుకుంటున్నారా

             అయితే కొనలేనివి ఇవిగో


            మంచం పరుపు కొనవచ్చు

                    కానీ నిద్ర కాదు


                 గడియారం కొనవచ్చు

                    కానీ కాలం కాదు


                  మందులు కొనవచ్చు

                   కానీ ఆరోగ్యం కాదు


                  భవంతులు కొనవచ్చు 

                   కానీ ఆత్మేయిత కాదు


                   పుస్తకాలు కొనవచ్చు

                      కానీ జ్ఞానం కాదు


          పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు

                     కానీ జీర్ణశక్తిని కాదు

                     🌹🌹🌹🌹🌹

      


ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే

అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు

కావాలి,


స్నానాలతోనే పాపాలు పోతే ముందు

చేపలే పాప విముక్తులు కావాలి,


తలక్రిందులుగా తపస్సు చేస్తేనే

పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు

గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,


ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది

నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ

పరుగులు పెడితే ప్రయోజనమే లేదు,


నీలో లేనిది బయటేమీ లేదు 

బయటఉన్నదంతా నీలోనూ ఉంది


తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....

సర్వే జనా సుఖినోభవంతు 

హరిఃఓం🙏

Saturday, August 7, 2021

"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"

 సమయానుకూలంగా మనమూ మారాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?

1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

కారణం ???

ఓకేఒక్కటి UPDATE.

they DIDN'T UPGRADE

 కాలక్రమేణా అవి మారలేదు. !!


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం… పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


మీరు ఎప్పుడైనా గమనించారా ..?


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచుకోవాలి. లేకపోతే తప్పక వెనుకబడిపోతాం..


 కాలక్రమేణా మార్పు సహజం

 అందువల్ల ...

 ప్రతి వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు తన స్వభావాన్ని కాలక్రమేణా అవసరానుగుణంగా మార్చుకుంటూ ఉండాలి.

 

"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"


 సమయంతో కదిలితే విజయం సాధించడం, లేకపోతే కనుమరుగైపోవడం.

Wednesday, May 5, 2021

🦌🦌 కొత్త యుద్ధం

 🦌🦌 కొత్త  యుద్ధం


 సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు


అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .


ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.


అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.


"అవును మాది జింకలవనం " అంది.


" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.


" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.


అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .


 సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .


వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .


 తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .


కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .


పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .


అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.


" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.

ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.


ఈ సింహం ఆహారం లేకుండా

14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.


కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.


ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.


జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.


పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.


ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

ఇంట్లోనే ఉండండి 

కరోనా రక్కసి పనిపట్టండి


మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా 🤔🙏🙏

Tuesday, February 2, 2021

నవ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే నాలా తయారవగలవు.

 ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.


రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది.


బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసి  ఇస్తాను అన్నా కూడా ఆ యునతి  మొండిగా  మారాం చేసే సరికి  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ  ....నవ్వుతూ    అన్నాడు  దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.


ఆ యువతి  ఆశ్చర్యంగా  పేయింటింగ్  వంక చూస్తూ ఉండి పోయింది.


మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  వాకబు చేసింది.


ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక  మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి   వెళ్ళింది.

 

రవివర్మని కలిసి   ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.


నాకు కూడా  చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.


రవివర్మ నవ్వుతూ అన్నాడు  అమ్మాయీ...!  నీకు  పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల  నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  


నవ్వూ నీ 30 సంవత్సరాలు  ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు.


ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.


  ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.


తల్లి తండ్రులు  నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.


     _ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి🌹



Wednesday, January 20, 2021

భగవద్గీత గురించి - if you know the value

 ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది.


ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందిన వారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా.


మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?


అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు.


నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.


వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు.


ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది.


నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను.


అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను.


అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు:- మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? 


ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.


సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించు కుంటారు.


మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు.


ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి. ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు.


ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు.


మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే.


మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది.


కానీ, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం కాలేదు.


మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండ వాళ్ళం.


మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను ఎప్పుడో ఒక సారి ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన Show Case లో భద్రంగా పెడుతున్నాం.


ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం.


సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత.


చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతితో అతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత.


ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత.


ఎన్నో వ్యాధులకు మందు రామాయణ,మహాభారత భగవద్గీత లలో ఉన్నాయి.


దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.


గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవమునకు విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత.


ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడ్డ గ్రంథం భగవద్గీత.


ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించ బడుతున్న గ్రంథం భగవద్గీత.


ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత.


 దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి, అర్థం చేసుకొని, దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.


Sunday, January 19, 2020

గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో - #mentorship

తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు, వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని చేత్తోపట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.
"నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు
ఎగిరిపోతుంది కదా" అన్నాడు.
తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు. "తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.
ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు.
"టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనోకూలిపోయింది.
"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా,
దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు. కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. "గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా, తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే" అని చెప్పాడు. మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.

జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని ,నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి. కుటుంబం మనల్ని పట్టుకుని లేదు. పట్టుకుని ఉందనుకుని వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనమే పట్టుతప్పిపోతాం. తెగిపోయిన గాలిపటంలా గింగిరాలు తిరుగుతూ ఎక్కడో పడిపోతాం.

Tuesday, September 10, 2019

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను💰 కలిగివున్నారు

ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు..
'నేను ఎందుకు పేదవాడను?😟

బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎందుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.😌

నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది? అని ఆ పేదవాడు అడిగాడు. 🤔


అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను💰 కలిగివున్నారు.

 మొదట మీ ముఖం👩🏼 ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..

రెండవది మీ కళ్ళు👀 మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

 మూడవది  మీ నోరు👄 మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..

 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో❤ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..

 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..👍అవసరమైనవారికి సహాయం చేయగలరు ..

సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.
            లాడి కిషోర్


🌸🌸🌸🔥🔥🔥🌸🌸🌸

Thursday, November 29, 2018

జీవిత సత్యం నేర్పిన గురువు - Enjoy every moment

జీవిత సత్యం నేర్పిన గురువు

చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న
స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తోంది . బాగా సెటిల్ అయ్యారు . కానీ జీవితంలో ఏదో మిస్‌ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది.

ఇదే విషయం గురించి చర్చించారు...
కానీ ఏదో మిస్‌ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు.....!
మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టారూని గుర్తుచేశారు.

ఆ మాస్టారూ పేరు గుర్తుకు రాగానే అందరి మోహాల్లో ఒక సంతోషం...! ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారూ అంటే అందరికీ ఎంతో ఇష్టం....
అతనొక స్పూర్తి ! అంతా ఒక అండస్టాండింగ్‌కు వచ్చారు...

ఆ మాస్టారూ ఎప్పుడూ అంత ఆనందంగా ఎలా ఉండేవాడో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలు దేరారు....!

ఆ మాస్టారూ దగ్గరకు వెళ్ళి, తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు..!

ఆయన చెప్పిన పాఠాల మూలంగానే  ఇంత గొప్పవాళ్లమయ్యామని గుర్తుచేశారు...! పనిలోపనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు,
సవాళ్లను కూడా ఏకరువూ పెట్టారు.

ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో వున్నా...వేలకు వేల జీతాలు సంపాధిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు.....!

ఇదంతా విన్న ఆ గురువు
కాసేపు కూర్చోండని చెప్పి లోపలికెళ్ళాడు.

కొద్ది సేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి  వేడి వేడి టీ ని  ఓ కేటిల్‌లో తీసుకుని వచ్చింది.

ఓ ప్లేట్‌లో రకరకాల కప్పులను
(పింగాణి, స్టీల్‌, మట్టి, రకరకా పూతో ఆకర్షణీయంగా డిజైన్‌ చేసినవి) తీసుకొచ్చి, వారి ముందుపెట్టి టీ తాగమని చెప్పి లోపలికెళ్ళింది.

వాళ్లంతా మోహమాట పడుతూనే....తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు...!

వాళ్లంతా టీ  తాగడం అయిపోగానే ఆ మాస్టారూ వాళ్లందరిని ఉద్దేశించి..

‘‘మీరంతా గమనించారా...
టీ మీ ముందుకు రాగానే ,  ఏ కప్పు తీసుకోవాలని కాసేపు అలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ  తాగారు..ఫలితం...
ఇక్కడున్న వాటిలో normal కప్పులే మిగిలిపోయాయి....!

అందరూ తాగే టీ
ఒకటేఅయినా... తాగుతూ..
ఇతరుల టీ  కప్పు,
దాని డిజైన్‌ తమ కప్పు కంటే ఎంత బాగున్నాయే అని మధన పడుతూ తాగుతున్నారు ...
 ఫలితం...తాగే
 "టీ ని  అస్వాధించడం" మరిచిపోయారు..

అదే సకల సమస్యలకు మూలం....

ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి...
వాటి వెంట పరిగెడితే ఇక అంతే...!

మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు...!

ఎదుటి వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో,
ఎంత రిచ్‌గా ఉన్నారో...
ఏ హోదాలో ఉన్నారో,
ఏం కొంటున్నారో
అని పొల్చుకొని...
మధన పడుతూ...
వాళ్లలా ఉండటానికి ప్రయత్నిస్తూ
మీ ఇష్టాఇష్టాలను,
మీ అభిరుచులను
అన్నీ అన్నీ మర్చిపోతున్నారు...

మీ జీవితం టీ అయితే.....
మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా
టీ కప్పులాంటివి..

కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి...కప్పులోని టీ ని  ఆస్వాధించటం నేర్చుకొండి. అప్పుడే "ఆనందంగా" ఉంటారు.
 అదే జీవిత సత్యం...

Sunday, November 11, 2018

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?


అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అందుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. 40 ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్ర భవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.
🍃🍃🍃
అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, 'నేను వెళ్తున్నా' అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా' ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ.

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా?

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపు కున్నాను.

ఇవి కాక గ్యాస్, అల్సర్ ఉండనే వున్నాయి కదా!ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి.

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట

అడుగు తీసి అడుగు వేయ డానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు.

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను?

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా?

నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం?

నేనుండేది నీ శరీరంలో. అదే నా అసలైన ఇల్లు కదా! నా ఇంటికి ఉన్న 9-ద్వారాలకూ సమస్యలే.

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు .. డబ్బు జబ్బు.  నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా?

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా?

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు.

ఇంకొకడిని అణగతొక్కడానికి  నాతో కుట్రలు చేయించావు.

ఎన్నిసార్లు నన్ను పగ, ద్వేషంతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా, చేసావో గుర్తు తెచ్చుకో.

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా?
ఇక నేనుండలేను వెళ్తున్నా!

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువ య్యింది.
దాంతో ఈ రోజు, ఈక్షణాన్ని ఆనందించడం మరచి పోతున్నాడు.
దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?

Friday, July 13, 2018

ఇదీ నిజమైన బ్రహ్మచర్యం....

ఇదీ నిజమైన బ్రహ్మచర్యం....
స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామీజీని ఇలా అడిగింది.

"స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.
దానికి మీరు అంగీకరిస్తారా"

స్వామి ఆమెను "మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది" అని అడిగారు.
అందుకామె " మీ తెలివితేటలు నాకు నచ్చాయి.
అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" అన్నది.

స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానమిచ్చారు.
"నా తెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పుబట్టను.
నాలాంటి బిడ్డను కావాలనుకోవడం తప్పు కాదు
కాని
దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది.
పైగా అలా జరుగుతుందని నిశ్చయంగా చెప్పలేము.
మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గం ఒకటి చెబుతాను.
ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను.
 మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి.
నావంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పోందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది." అని ఆమెకు నమస్కరించారు.

వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కయింది.
ఆ వివేకానందుడి వారసులమని గర్వంగా చెప్పుకొందాం.

Saturday, May 6, 2017

బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు

ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్దమనిషి, మరొకరు ఒక యువకుడు.

ఆ ఇద్దరు ఒకే లాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరు వైపులా పెంచడం మొదలుపెట్టారు.

ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్ళు ఎరువు ఇవ్వసాగాడు. కాని, ఆ పెద్దమనిషి కాస్తంత ఎరువు కొన్ని నీళ్లు ఇచ్చేవాడు.

కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయింది.

ఇక ఆ పెద్దమనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాక పోయిన బలంగా నిండుగా అయింది.

ఒక రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.

మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చ్చారు.

ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్ళతో పాటు పడిపోయి ఉండడం చూసాడు. కాని ఆ పెద్దమనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.

దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు.

ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి.

"* చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసారానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషకవిలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు ఇఛ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్ళను భూమి లోతుల వరకు పరిచింది.

నీ చెట్టు వేళ్ళు పైపైన మాత్రమే ఉండడంవల్ల గాలికి తట్టుకుని భూమిలోపల నిలదొక్కుకోలేకపోయాయి.

నా చెట్టు వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటంవల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకుని అలాగే  నిలబడగలిగింది.*"

ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు, మనం కని పెంచే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అందరం గమనించాలి.

🌳🌲🌴👶👶👶👶🌴🌲🌳 every parent must read.....& implement....

Thursday, March 30, 2017

మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం

✍�అబ్దుల్ కలాం గారి చిన్నప్పటి ఒక సంఘటన:

🔸ఒకరోజు పగలంతా ఎక్కువగా పని ఉండటంతో అబ్దుల్ కలాం గారి వాళ్ళమ్మ బాగా అలసిపోయింది.

🔸ఆ రోజు రాత్రి వంట పూర్తయిందనీ..........., భోజనానికి రమ్మని....... ఆమె పిలవడంతో
అబ్దుల్ కలాం గారు, తన తండ్రితో కలిసి భోజనం చేయడానికి సిద్దపడ్డారు.

🔸తన తండ్రి ముందు ఒక ప్లేట్ లో పెట్టిన రొట్టెలు బాగా మాడిపోయి ఉండటాన్ని చూసిన
అబ్దుల్ కలాం గారు, ఆయన వాటిని తినే ముందు తన తల్లిని ఏమైనా కోప్పడతారేమోనని ............, మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయారు.

🔸కానీ ఆయన ఆ రొట్టెలను తిని........., ఆమెను ఏమీ అనకుండా లేచి వెళ్ళిపోయాడు.

🔸కొద్దిసేపటికి ఆమె, తన భర్త దగ్గరకు వెళ్ళి........ “ రొట్టెలు మాడిపోయినందుకు క్షమించమని.......” కోరింది. వెంటనే ఆయన, “ నాకు మాడిపోయిన రొట్టెలంటే చాలా ఇష్టం..... “ అని ఎంతో ప్రేమగా ఆమెతో అన్నారు.

🔸ఇదంతా గమనించిన అబ్దుల్ కలాం గారు, కొద్దిసేపటి తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి “మీకు నిజంగా మాడిపోయిన రొట్టెలు అంటే అంత ఇష్టమా.....? అని అడిగారు.

🔸ఆయన అబ్దుల్ కలాం గారి తల నిమురుతూ......, “ మీ అమ్మ పగలంతా కష్టపడి ఎంతో
అలసిపోయింది.

🔸అంత అలసటలో కూడా విసుగు లేకుండా వంట చేసింది.

🔸ఒక్కపూట మాడిపోయిన రొట్టెలు తింటే మనకేమీ కాదు.

🔸 కానీ ఆ రొట్టెలు మాడిపోయాయని విమర్శిస్తే........, ఆమె మనసు ఎంతగానో బాధ పడుతుంది.

🔹అలా బాధ పెట్టడం నాకిష్టం లేదు.

🔸జీవితంలో ఎవరైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజం.

🔸ఆ పొరపాట్లను ఆధారంగా చేసుకొని విమర్శించడం మంచిది కాదని........” ఆయన అన్నారు.

🔹ఈ సంఘటన ద్వారా అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం,  ఎదుటివారు చేసిన పొరపాట్లను చూసి తొందరపడి విమర్శించి వారి మనసులను బాధ పెట్టకండి.

🔹బంధాలను బలపరుచుకుంటూ జీవితాలను కొనసాగించండి

Wednesday, November 16, 2016

ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

ఆర్య పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
.
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది .
.
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
.
.
.
.
..
.
.
ఎందుకలా జరిగింది ?
.
.
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

Thursday, May 19, 2016

This is called "Self-Appraisal”

A Little boy went to a telephone booth which   was at the cash counter of a store and dialed a number. The store-owner observed and listened to the conversation:

Boy: “Madam, can you give me the job of cutting your lawn?”

Woman: (at the other end of the phone line)  “I already have someone to cut my lawn.”

Boy: “Madam, I will cut your lawn for half the price than the person who cuts your lawn now.”

Woman: “I’m very satisfied with the person who is presently cutting the lawn.”

Boy: (with more perseverance) “Madam, I’ll even sweep the floor and the stairs of your house for free.”

Woman: “No, thank you.”

With a smile on his face, the little boy put the receiver down. The store-owner, who was listening to all this, walked over to the boy.

Store-owner: “Son….I like your attitude; I like that positive spirit and would like to offer you a job.”

Boy: “No thanks.”

Store-owner: “But you were really pleading for one.”

Boy: “No Sir, I was just checking my performance at the job I already have. I am the one who is working for that lady I was talking
 to!”

This is called  "Self-Appraisal”

Give your best and the world comes to you!
Don't relax or show lazyness.. Whole world is watching you!!

A famous quote said by Lord Krishna in Bhagvat Gita :

"If u don't fight for what u want,
don't cry for what u lost..." 

"Nothing depends on luck, everything depends on work because, 
even luck has to work..."

Wednesday, May 18, 2016

కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు . . నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు .

అతడు  ఎడారిలో  దారి  తప్పిపోయాడు  .  కూడా  తెచ్చుకున్న  నీళ్ళు   రెండు  రోజులపాటు  కాపాడాయి  .  నడుస్తున్నాడు
.
.
 నీరు   ఎక్కడా   కనబడటం  లేదు  .   ఎండమావులు  తప్ప  ఎక్కడా  నీటి  జాడ  కనబడటం  లేదు  .  తన  జీవితపు  ఆఖరు  దశకు  చేరాను  అని   అతడికి  తెలిసిపోతోంది  . ఈ   రాత్రి  గడవదు   . రేపు  ఉదయం  చూడను   అని  అనుకుంటున్న  దశలో   ప్రయత్నం  చెయ్యడమా  ?  అలాగే  నిరాశతో  కూలబడి పోవడమా   ఎటూనిశ్చయించుకోలేకపోతున్నాడు .
.
దూరంగా   ఒక  గుడిసె   లాంటిది   కనబడింది  .  అది   నిజమా  ?  తన  భ్రమా   ?  
.

ఏమో  !  నిజమేమో  !  అక్కడ  తనకు   నీరు  దొరకవచ్చేమో  ! చనిపోయేముందు   ఆఖరు  ప్రయత్నం చెయ్యాలి  అని  అనుకున్నాడు
శక్తిని  కూడదీసుకున్నాడు .  తడబదిపోతున్న  అడుగులతో   ముందుకు  నడుస్తున్నాడు  .

 ఎదురుగ అతడు  అనుకున్నట్టుగానే  ఒక  గుడిసె   కనబడుతోంది  .   దానిని  సమీపించాడు    .  అక్కడ  ఎవరూ  లేరు  .  బహుశా  దానిని  వదిలిపెట్టి  ఉంటారు  .   లోపలికి  వెళ్ళాడు
.
.
.  అక్కడ  ఒక   నీటి  పంపు(బోరింగ్)  కనబడింది   .  దానిని  చూడగానే   ప్రాణం  లేచి వచ్చినట్టు  అయ్యింది  .   దాని  దగ్గరకి  వెళ్లి  దానిని   కొట్టాడు   .

నీరు   రావడం  లేదు   .  శక్తి  అంతా  ఉపయోగించి   దానిని   కొట్టాడు    .  ప్రయోజనం  లేదు   .  నిరాశ నిస్పృహ  ఆవరించాయి   .

ఒంట్లో    ఉన్న  కొద్ది  నీరూ   అయిపొయింది  .  కళ్ళు  మూసుకుపోతున్నాయి
.
.
 .  ఒక  మూలగా  ఒక  సీసా  కనబడింది  .  దానిలో  నీరు   ఉంది  . మూత  గట్టిగా  బిగించి  ఉంది .  మూత  విప్పి   దాన్ని  ఎత్తిపెట్టి  తాగుదామని  పైకి  ఎత్తాడు  .

దానికి  ఒక  కాగితం  కట్టబడి  ఉంది   .  దానిమీద  ఇలా  రాసి  ఉంది  .
.
.
.
“ ఈ   బోటిల్   లో  నీరు  బోరింగ్ పంపులో పొయ్యండి   .  పంపు  కొట్టండి  నీరు  వస్తుంది  .  మీరు   మళ్ళీ   ఈ  బాటిల్  నింపి  పెట్టండి  “
.
.

.
అతడికి  సందేహం  కలిగింది  .

ఈ   నీరు  తాగెయ్యడమా  ?
బోరింగ్ పంపులో  పోయ్యడమా   ?
 ఎంత కొట్టినా  రాని  నీరు  ఈ   బాటిల్  లో   నీరు   పోస్తే   వస్తుందా  ?
ఉన్న  ఈ   నీరు  కాస్తా  పోసేస్తే  తర్వాత   రాకపోతే  తన  గతి  ఏమి  కాను  ?
 చేతిలో  ఉన్న  నీరు   తాగితే   కనీసం  ఇంకో రెండు  రోజులు  బ్రతక  వచ్చు  .
 అందులో  పోసేస్తే  తన  మరణం ఖాయం  .
ఏమి  చెయ్యాలి   ?
ఎంతకూ  ఆలోచనలు  తెగడం  లేదు  .
.

.
ఒక  నిశ్చయానికి   వచ్చాడు   .
 నీళ్ళను   పంపులో  పోశాడు  .
బోరింగ్ పంపు  కొట్టడం  మొదలు  పెట్టాడు  .  

ఆశ్చర్యం  .  

పాతాళ  గంగ  పైకి   తన్నుకు   వచ్చింది   .

 భగవంతుడికి  కృతజ్ఞతలు  చెప్పుకున్నాడు . నీళ్ళు తాగి మళ్ళీ  బోటిల్  నింపాడు   .
మూలన   పెట్టాడు  .
తన  కూడా  తెచ్చుకున్న   నీటి  బాటిల్   నింపుకున్నాడు  .
ఆ  గుడిసె  లో  ఎడారి   మేప్   కనబడింది  .
తను  ఎటు  వెళ్ళాలో   చూసుకున్నాడు   .   బయలుదేరాడు  .
.
.
.
.

మిత్రులారా  !
.
ఈ  కద    మన  జీవితాలను  ప్రతిబింబిస్తోంది  కదూ  !
.
.
ఏదైనా   పొందాలి  అంటే   ఇవ్వడం  నేర్చుకోవాలి  .
.
ఇవ్వడం  వలన   మనం   పొందగలం  అనే  నమ్మకాన్ని కలిగి  ఉండాలి
.
ఫలితం మీద   ఆశ  పెట్టుకోకుండా   ప్రయత్నించాలి

.
.
కృషి  చెయ్యకుండా   ఫలితం  ఆశించకూడదు  .
.
 
నువ్వు  ఇవ్వకుండా  దేనినీ   పొందలేవు .

Monday, May 16, 2016

తెలివైన ఆవు

అనగనగా ఒక ఊరు,
 ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు.
అతని దగ్గర ఒక ఆవు ఉండేది.
అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది.
 అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది.
చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని,
ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను.
ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.

అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
 అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.

ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.
ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు.
 పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు.
ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది,
తరువాత అరవకుండా ఉండిపోయింది.
 అమ్మయ్య ఆనుకున్నాడు.

కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు.
 తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది.
అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది.
 బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది.
ఆవు తెలివికి మెచ్చిన అతను, తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.

నీతి :
ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు.
కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.
👏🏾👏🏾

నేర్చుకోవడం............

సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.

సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు. జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు. సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. శిష్యులు ”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది. గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నాజీవితంలో గంట సమయముంది. అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు. శిష్యుల నోట్లో మాట రాలేదు.