అతడు ఎడారిలో దారి తప్పిపోయాడు . కూడా తెచ్చుకున్న నీళ్ళు రెండు రోజులపాటు కాపాడాయి . నడుస్తున్నాడు
.
.
నీరు ఎక్కడా కనబడటం లేదు . ఎండమావులు తప్ప ఎక్కడా నీటి జాడ కనబడటం లేదు . తన జీవితపు ఆఖరు దశకు చేరాను అని అతడికి తెలిసిపోతోంది . ఈ రాత్రి గడవదు . రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చెయ్యడమా ? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూనిశ్చయించుకోలేకపోతున్నాడు .
.
దూరంగా ఒక గుడిసె లాంటిది కనబడింది . అది నిజమా ? తన భ్రమా ?
.
ఏమో ! నిజమేమో ! అక్కడ తనకు నీరు దొరకవచ్చేమో ! చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నాడు
శక్తిని కూడదీసుకున్నాడు . తడబదిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు .
ఎదురుగ అతడు అనుకున్నట్టుగానే ఒక గుడిసె కనబడుతోంది . దానిని సమీపించాడు . అక్కడ ఎవరూ లేరు . బహుశా దానిని వదిలిపెట్టి ఉంటారు . లోపలికి వెళ్ళాడు
.
.
. అక్కడ ఒక నీటి పంపు(బోరింగ్) కనబడింది . దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది . దాని దగ్గరకి వెళ్లి దానిని కొట్టాడు .
నీరు రావడం లేదు . శక్తి అంతా ఉపయోగించి దానిని కొట్టాడు . ప్రయోజనం లేదు . నిరాశ నిస్పృహ ఆవరించాయి .
ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపొయింది . కళ్ళు మూసుకుపోతున్నాయి
.
.
. ఒక మూలగా ఒక సీసా కనబడింది . దానిలో నీరు ఉంది . మూత గట్టిగా బిగించి ఉంది . మూత విప్పి దాన్ని ఎత్తిపెట్టి తాగుదామని పైకి ఎత్తాడు .
దానికి ఒక కాగితం కట్టబడి ఉంది . దానిమీద ఇలా రాసి ఉంది .
.
.
.
“ ఈ బోటిల్ లో నీరు బోరింగ్ పంపులో పొయ్యండి . పంపు కొట్టండి నీరు వస్తుంది . మీరు మళ్ళీ ఈ బాటిల్ నింపి పెట్టండి “
.
.
.
అతడికి సందేహం కలిగింది .
ఈ నీరు తాగెయ్యడమా ?
బోరింగ్ పంపులో పోయ్యడమా ?
ఎంత కొట్టినా రాని నీరు ఈ బాటిల్ లో నీరు పోస్తే వస్తుందా ?
ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను ?
చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బ్రతక వచ్చు .
అందులో పోసేస్తే తన మరణం ఖాయం .
ఏమి చెయ్యాలి ?
ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు .
.
.
ఒక నిశ్చయానికి వచ్చాడు .
నీళ్ళను పంపులో పోశాడు .
బోరింగ్ పంపు కొట్టడం మొదలు పెట్టాడు .
ఆశ్చర్యం .
పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది .
భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు . నీళ్ళు తాగి మళ్ళీ బోటిల్ నింపాడు .
మూలన పెట్టాడు .
తన కూడా తెచ్చుకున్న నీటి బాటిల్ నింపుకున్నాడు .
ఆ గుడిసె లో ఎడారి మేప్ కనబడింది .
తను ఎటు వెళ్ళాలో చూసుకున్నాడు . బయలుదేరాడు .
.
.
.
.
మిత్రులారా !
.
ఈ కద మన జీవితాలను ప్రతిబింబిస్తోంది కదూ !
.
.
ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి .
.
ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి
.
ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి
.
.
కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు .
.
నువ్వు ఇవ్వకుండా దేనినీ పొందలేవు .
No comments:
Post a Comment